నిండు కుండలా సుంకేసుల జలాశయం
NEWS Jul 09,2025 07:17 am
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు కళ కళ లాడుతున్నాయి. కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయం పూర్తిగా నిండి పోయింది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి వేసి కిందకు నీటిని వదిలారు. ఇన్ ఫ్లో 60 వేలు ఉండగా ఔట్ ఫ్లో 62 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 0.634గా ఉంది.