రైతుల సమస్యలను రాజకీయం చేయొద్దు
NEWS Jul 08,2025 04:49 pm
పంటల సాగు సీజన్ అయి పోయిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ రైతులను పరామర్శించడంపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సమస్యలను రాజకీయం చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదన్నారు. వేల మందితో వెళ్లడం, ప్రచారం చేసుకోవడం తప్పితే చేసేదీ ఏమీ ఉండదన్నారు. పర్యటనల పేరుతో బల ప్రదర్శనలకు దిగడం దారుణమన్నారు. ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు మంచిది కాదన్నారు.