'పెద్దపులి'కి ఎమ్మెల్యే సత్యమంటే అభిమానం
NEWS Jul 08,2025 09:07 pm
మొహర్రం వేడుకల్లో భాగంగా ఎక్కడాలేని విధంగా మల్యాల మండలంలో పెద్దపులుల సందడి ఉంటుంది. పండుగ ఆఖరి రోజు కావడంతో ఆదివారం భారీ సంఖ్యలో పులి వేషాలు వేస్తున్నారు. ఈ క్రమంలో పులి వేషం వేసిన మల్యాలకు చెందిన భార్గవ్ అనే యువకుడు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై అభిమానం చాటుకున్నాడు. తన వీపుపై 'సత్యం అన్న ఎమ్మెల్యే' అని పేరు రాయించుకొని పెద్దపులి వేషం వేయడంతో స్థానిక నాయకులు, తదితరులు భార్గవ్ ను అభినందించారు.