దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా..
NEWS Jul 06,2025 03:06 am
భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఉత్తర కుమారుడి మాటలు కట్టి పెట్టాలని, దమ్ముంటే మీ నాయిన కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకు రావాలని సవాల్ విసిరారు. తమ నాయకుడు రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరేంత సీన్ నీకు లేదన్నారు. గతంలో చాలాసార్లు సవాళ్లు విసిరిన నువ్వు ఏనాడైనా బహిరంగ చర్చకు వచ్చావా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి, అర్హత నీకు లేనే లేదన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, తొడలు కొడితే పిచ్చోడివి అని అనుకుంటారని ఎద్దేవా చేశారు.