ట్రంప్‌కు షాక్..ఎలాన్ మస్క్ కొత్త పార్టీ
NEWS Jul 06,2025 01:59 am
టెస్లా చైర్మన్, ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఆమోదం పొందితే తప్పకుండా పార్టీ పెడతానంటూ గతంలో తెలిపారు. సోషల్ మీడియాలో సలహాలకు, సూచనలకు అనుగుణంగా ఎక్స్ ఖాతాదారుల నుంచి భారీ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.