మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్
NEWS Jul 04,2025 04:38 am
స్టార్టప్‌లకు హబ్‌గా భారత్ మారుతోందన్నారు ప్రధాని మోదీ. దాదాపు 120 స్టార్టప్‌లకు యూనికార్న్ హోదా లభించిందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్, క్వాంటం కంప్యూటింగ్ కోసం జాతీయ మిషన్ల వృద్ధికి కొత్త ఇంజన్‌లుగా మారుతున్నాయన్నారు. గత దశాబ్దంలో భారతదేశం 250 మిలియన్లకు పైగా ప్రజలను తీవ్ర పేదరికం నుండి బయట పడేసిందన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు సైతం గుర్తించిందని, ప్రశంసలు కురిపించిందని తెలిపారు మోదీ.