జూరాలకు పోటెత్తుతున్న వరద
NEWS Jul 04,2025 09:12 am
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఇన్ ఫ్లో 98,290 వేల క్యూ సెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1,00,878 వేల క్యూ సెక్కులు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్లం 1045 ఫీట్లు కాగా ప్రస్తుత నీటి నమట్టం 1042.028 ఫీట్లు ఉన్నాయి. నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.855 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి 11 యూనిట్లతో కొనసాగుతోంది.