నేడు అల్లూరి సీతారామ రాజు జయంతి
NEWS Jul 04,2025 08:45 am
తెలుగు పౌరుషానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిన అల్లూరి సీతారామ రాజు జయంతి నేడు. గిరిజన హక్కుల కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించాడు. బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. మే 7, 1924లో ప్రాణాలు కోల్పోయాడు. 1922లో జరిగిన మన్యం తిరుగుబాటు చరిత్రలో నిలిచి పోతుంది. ఆయన జయంతి సందర్బంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు.