నేడు అమెరికా ఇండిపెండెన్స్ డే
NEWS Jul 04,2025 08:06 am
అమెరికా 249వ ఇండిపెండెన్స్ డేను శుక్రవారం జరుపుకుంటోంది. దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. ఈ సందర్బంగా దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల వల్ల బ్రిటన్ నుంచి దేశం విముక్తి పొందిందని అన్నారు. దేశ ప్రజలందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్పూర్తితో సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే బలీయమైన ఆర్థిక శక్తిగా, ఆయుధ, అణ్వాయుధ పరంగా అత్యంత బలమైన దేశంగా ఎదిగిందన్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.