తిరుపతి అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశం
NEWS Jul 03,2025 03:25 pm
తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి ఆలయ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని మేయర్ డాక్టర్ శిరీష సందర్శించారు. షాపు దగ్ధం కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తిరుపతికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నగరంలో షాపుల నిర్వాహకులకు సూచనలు చేయాలని విపత్తు నిర్వహణ సంస్థ, అగ్ని ప్రమాద శాఖల అధికారులకు సూచించారు. ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు మేయర్.