ఏరియా ఆస్పత్రుల్లో టాటా డీజీ నెర్వ్ సెంటర్స్ - సీఎం
NEWS Jul 03,2025 02:42 pm
టాటా సంస్థ భాగస్వామ్యంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డీజీ నెర్వ్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ప్రజలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. డీజీ నెర్వ్ సెంటర్స్ పనితీరు బాగుందంటూ ప్రశంసించారు. ఆయా కేంద్రాలలో 2 వేల మందిని నియమిస్తామన్నారు.