దశల వారీగా తొమ్మిది గంటల కరెంట్
NEWS Jul 03,2025 06:03 pm
రాష్ట్రంలో రైతాంగానికి దశలవారీగా 9 గంటల విద్యుత్ అందిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రతి సబ్ స్టేషన్ పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి రైతు తనకున్న ఖాళీ స్థలాన్ని సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించాలన్నారు.