భూ అక్రమాలపై విచారణ చేపట్టాలి
NEWS Jul 03,2025 05:57 pm
కనిగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఐ కమిటీ సమావేశం నిర్వహించింది. రోజురోజుకూ భూకబ్జాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయన్నారు ఆ పార్టీ కార్యదర్శి పి సి కేశవరావు. భూ ఆక్రమణలపై సిట్ వేసి సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలన్నారు. విచారణ వేగవంతం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.