జరుగుమల్లిలో పర్యటించిన మంత్రి
NEWS Jul 03,2025 12:32 pm
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల కేంద్రంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మ్యారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, జరుగుమల్లిలో ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. అనంతరం పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.