ఇంటి స్థలం కోసం పరస్పరం దాడులు
మహిళలకు గాయాలు
NEWS Jul 03,2025 11:33 am
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వెంకట కృష్ణాపురం గ్రామంలో ఇంటి స్థలం వివాదంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం ఒకరిపై మరొకరు కర్రలు, పైపులతో దాడులు చేసుకున్నారు. దాడిలో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.