అధికారికంగా రోశయ్య జయంతి
NEWS Jul 03,2025 08:55 am
ప్రతి ఏటా అధికారికంగా జూలై 4న దివంగత సీఎం కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ బాధ్యతను తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖకు అప్పగించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పాల్గొని రోశయ్య జయంతి నిర్వహించాలని ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యది.