శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం
NEWS Jul 03,2025 08:50 am
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి ప్రాంతంలో ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దుకాణాల పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.