సంజూ శాంసన్ పై సీఎస్కే ఫోకస్
NEWS Jul 03,2025 07:22 am
భారతీయ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను తీసుకునేందుకు తాము ఆసక్తి చూపిస్తున్నామని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది. వచ్చే ఏడాదిలో జరిగే ఐపీఎల్ కోసం వేలం పాటలో తప్పకుండా తనను తీసుకునేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది. దీంతో దాదాపు తన చేరిక ఖరారైనట్టేనని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. మరో వైపు రాజస్థాన్ రాయల్స్ తో సుదీర్ఘ కాలంపాటు ప్రాతినిధ్యం వహించాడు శాంసన్. స్కిప్పర్ గా ఆ జట్టును సెమీస్ దాకా తీసుకు వెళ్లాడు.