ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఘనాకు చేరుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్బంగా ఘన స్వాగతం పలికారు ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామా. రెండు రోజుల పాటు ఘనాలోనే ఉంటారు. భారత్ - ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు ఇరు దేశాల అధినేతలు.