విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు: జగన్ ఆగ్రహం
NEWS Jul 02,2025 09:00 pm
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి, ఏపీ కూటమి ప్రభుత్వం విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శిక్షణ, రిజిస్ట్రేషన్‌లో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందని తెలిపారు.