సేవలకు ఆటంకం కలిగిస్తే చర్యలు - టీటీడీ
NEWS Jul 02,2025 03:12 pm
శ్రీవారి భక్తులకు సేవలు అందించే కాంట్రాక్టు సిబ్బంది విధులను బహిష్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది టీటీడీ. ఇప్పటికే ఎస్మా చట్టం అమలులో ఉందని తెలిపింది. న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసింది. పారిశుధ్ద్యం, ఆరోగ్యం తదితర శాఖలలో సంబంధిత ఉద్యోగులు విశేషంగా సేవలు అందిస్తున్నారని, భక్తులకు ఇబ్బందులకు గురిచేసే చర్యలు తీసుకోవద్దని కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జాబ్స్ నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.