జగన్ రాజకీయాలకు అనర్హుడు
NEWS Jul 02,2025 04:08 pm
మాజీ సీఎం జగన్ రాజకీయాలకు పనికి రాడన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తన హయాంలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. అప్పుల కుప్పగా తయారు చేసి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో తన పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా బుద్ది రావడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.