మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
NEWS Jul 02,2025 01:22 pm
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో సంభవించిన పేలుడులో 40 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. కంపెనీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ప్రకటించింది. గాయపడినవారికి వైద్య, పునరావాస సహాయం అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని, 90 రోజులు కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని కంపెనీ పేర్కొంది.