కుప్పంలో సీఎం చంద్రబాబు ప్రసంగం: ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
NEWS Jul 02,2025 06:12 pm
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రూ.3890 కోట్లతో హంద్రినీవా పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు.