ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన మంత్రి
NEWS Jul 02,2025 08:40 pm
ప్రకాశం జిల్లా కొండపి మండలం గోగినేనివారిపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. తొలుత నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని యాప్ లో నమోదు చేశారు. తల్లికి వందనం, గ్యాస్ డబ్బులు అందాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు.