మేడారం జాతర తేదీల ప్రకటన
NEWS Jul 02,2025 05:47 am
మేడారం మహా జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు కొనసాగుతుందని పూజారుల సంఘం తెలిపింది. 28న సారలమ్మ, గోవింద రాజు, పగిడిగిద్దరాజు, 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారని పేర్కొంది. 30న భక్తులు మొక్కులు చెల్లిస్తారని, 31న అమ్మ వార్ల వన ప్రవేశం ఉంటుందని తెలిపింది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరగనుంది.