గురుకుల టీచర్లకు ఏపీ సర్కార్ శుభవార్త
NEWS Jul 02,2025 04:08 am
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 2,360 మంది ఔట్‌సోర్సింగ్ బోధనా సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసిన ప్రభుత్వం, ఈ నెల 31లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులకు స్థిరత్వం, ఉద్యోగ భద్రత లభించనుంది.