ఆరు నెలల్లో 126 కేసులు - ఏసీబీ
NEWS Jul 02,2025 03:47 am
తెలంగాణలో గత ఆరు నెలల కాలంలో 126 కేసులు నమోదు చేసినట్లు ప్రకటించింది ఏసీబీ. రూ. 27.66 కోట్ల అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారని గుర్తించామని తెలిపింది. రూ. 24.57 లక్షల నగదు సీజ్ చేశామని పేర్కొంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వాటిల్లో 80 కేసులు నమోదు చేశామని వెల్లడించింది. ఇందులో భాగంగా 8 ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులు నమోదైనట్లు తెలిపింది.