వంశీ బెయిల్ రద్దు కోసం సర్కార్ దావా
NEWS Jul 02,2025 03:07 am
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నకిలీ ఇళ్ల పట్టా కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. నూజివీడు కోర్టు తనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ రద్దు చేయాలని పిటిషన్ వేసింది. ఇప్పటికే వల్లభనేని వంశీపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.