తెలంగాణలో వానలే..వానలు
NEWS Jul 02,2025 08:31 am
తెలంగాణ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో.. ఇవాళ హైదరాబాద్‌తో పాటు 10 జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో రెండ్రోజులుగా ముసురుపట్టి వాన పడుతోంది. అటు.. ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.