మద్యం తాగి లారీ నడిపిన డ్రైవర్ కు జైలు శిక్ష
NEWS Jul 01,2025 11:31 pm
ప్రకాశం జిల్లా కంభం మండలంలో మద్యం తాగి లారీ నడిపిన లారీ డ్రైవర్ కు గిద్దలూరు కోర్టు జరిమానా జైలు శిక్ష విధించింది. లారీ డ్రైవర్ కు రూ.10 వేలు జరిమానా 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి భరత్ చంద్ర తీర్పించారు. జరిమానా చెల్లించని ఎడల మరో 20 రోజులు లారీ డ్రైవర్ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.