బీజేపీ కొత్త చీఫ్‌కు శుభాకాంక్షల వెల్లువ
NEWS Jul 01,2025 01:05 pm
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా PVN మాధవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.