థాయిలాండ్ ప్రధానిపై సస్పెన్షన్ వేటు
NEWS Jul 01,2025 12:27 pm
థాయిలాండ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధానమంత్రి షినవత్రను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కంబోడియా నేత హున్ సేన్ కు ప్రధాని ఫోన్ కాల్ చేయడంపై దుమారం చెలరేగింది. హున్ సేన్ ను అంకుల్ అని సంభోదించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన కోర్టు ప్రధాని విధులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. తుది తీర్పు వెలువడేంత వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని పేర్కొంది.