బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
NEWS Jul 01,2025 11:28 am
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు. ఆయన తన స్వయం సహాయక కార్యక్రమాలు, ఉపన్యాసాల ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. విద్య, మానసిక ఆరోగ్యం, సామాజిక సేవల్లో ఆయన కృషి అమూల్యం. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి సానుభూతి తెలిపారు. రేపు జూబ్లీహిల్స్ మహప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.