నటి పాకీజాకి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
NEWS Jul 01,2025 11:33 am
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి పాకిజాకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు. ఆమె దీన స్థితిని చూసి చలించారు. జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరి ప్రసాద్ , గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ పవన్ తరపున రూ. 2 లక్షలను పాకీజాకు అందజేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు నటి. పవన్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.