అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్
NEWS Jul 01,2025 05:23 pm
కొమరోలు మండలం తాటిచెర్లమోటు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. గిద్దలూరు పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. అత్యాచారానికి సహకరించిన వారిలో మహిళ కూడా ఉందన్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని డీఎస్పీ చెప్పారు.