మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం
NEWS Jul 01,2025 03:17 pm
పాశమైలారం ఘటనపై స్పందించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం కంపెనీ యాజమాన్యంతో ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఈ దుర్ఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.