భారీగా ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ
NEWS Jul 01,2025 12:30 pm
రైల్వే శాఖ కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్రయాణీకులకు. ఇవాల్టి నుంచి దేశ వ్యాప్తంగా ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏసీ జర్నీకి కి.మీ.కు 2 పైసలు, నాన్ ఏసీ కి.మీ. ఒక పైసా చొప్పున పెంచింది. ఏసీ తరగతి ఫస్ట్ క్లాస్ , 2 టైర్ , 3 టైర్ , చైర్ కార్ కింద బుక్ చేసుకునే టికెట్ల ధరలు పెంచింది. సబర్జన్ ఛార్జీలు, నెలవారీ సీజనల్ ఛార్జీలను అలాగే ఉంచింది. ఏదైనా ఏసీ తరగతిలో 1,000 కి.మీ ప్రయాణిస్తే రూ.20 ఎక్కువ చెల్లించాలి. ఎక్స్ ప్రెస్ మెయిల్ , ఎక్స్‌ప్రెస్ రైలులో స్లీపర్ లేదా జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారికి అదనంగా రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది.