ఆకట్టుకుంటున్న 'తమ్ముడు' రిలీజ్ ట్రైలర్
NEWS Jul 01,2025 11:45 am
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి, అందరి దృష్టిని ఆకర్షిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.