తెలుగు రాష్ట్రాల్లో..మూడు రోజులు వానలే!
NEWS Jul 01,2025 04:23 am
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరుగా హెచ్చరికలు జారీ చేశారు.