గుడిపాడులో స్వచ్చ సర్వేక్షణ గ్రామీణ్ సభ్యుల పర్యటన
NEWS Jun 30,2025 04:22 pm
కనిగిరి మండలం గుడిపాడులోని ప్రాథమిక పాఠశాలను స్వచ్చ సర్వేక్షణ గ్రామీణ్ సభ్యులు సందర్శించారు. అనంతరం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సెంట్రల్ టీం సభ్యులు రవి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్ శర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.