ధనుష్ వ్యవహారంపై స్పందించిన డైరెక్టర్
NEWS Jun 30,2025 04:47 pm
ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరో ధనుష్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. తన తదుపరి చిత్రాన్ని నటుడు శింబుతో చేయనుండటమే ఈ పుకార్లకు కారణం కాగా, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెట్రిమారన్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ ప్రచారం తనను ఎంతగానో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.