చిన్నప్పన్నపాలెం: పైడిమాంబ ఆలయంలో చోరీ
NEWS Jun 30,2025 10:21 pm
బుచ్చయ్యపేట మండలం చిన్నప్పన్నపాలెం గ్రామంలో పైడిమాంబ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఉండే పగలగొట్టి నగదు అమ్మవారు మెడలో ఉన్నటువంటి 50 తులాల వెండి ఆభరణం అపహరించుకుపోయారు. సోమవారం తెల్లవారుజామున గేట్లు పగలగొట్టి, ఉండి చల్లాచెదురుగా ఉండడంతో కమిటీ సభ్యులు రమేష్, రాము, ప్రసాద్, బుచ్చయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయం గేట్లు పగలగొట్టి లోపలకు ప్రవేశించి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని తెలిపారు.