తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
NEWS Jun 30,2025 12:58 pm
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం వ్యవహారంపై ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర సారథిని అధిష్టానం నామినేట్ చేయడం సరికాదని, అంతర్గత ఎన్నికలు నిర్వహించి ఎన్నుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఇలా నావాళ్లు, నీవాళ్లు అంటూ నియామకాలు చేపడితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.