'కన్నప్ప'పై పైరసీ పంజా.. హార్ట్ బ్రేకింగ్ అంటూ మంచు విష్ణు ట్వీట్
NEWS Jun 30,2025 12:32 pm
ప్రతిష్ఠాత్మకంగా, పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న 'కన్నప్ప' చిత్రంపై పైరసీ భూతం పంజా విసిరింది. ఈ చిత్రానికి సంబంధించిన వేలాది పైరసీ లింకులు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంపై 'కన్నప్ప' చిత్ర బృందం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు హీరో మంచు విష్ణు హార్ట్ బ్రేకింగ్ అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇప్పటివరకు 30,000కు పైగా పైరసీ లింకులను గుర్తించి తొలగించినట్లు వెల్లడించారు.