రూ. 70 కోట్లు ఖర్చు చేసి గెలిచాం - కొండా
NEWS Jun 30,2025 10:13 am
మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణలపై భగ్గుమన్నారు. గత ఎన్నికల్లో రూ. 70 కోట్లు ఖర్చు పెట్టి గెలిచామన్నారు. కేవలం ఎన్నికల కోసమే తనకున్న 500 ఎకరాల్లో 16 ఎకరాలు అమ్మానని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీ అని, తనకు ఎవరి డబ్బులు అక్కర్లేదన్నారు. తను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, నేను ఎవరికీ భయపడే రకం కాదన్నారు.