జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
NEWS Jun 30,2025 09:45 am
జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 14 గేట్లు ఓపెన్ చేశారు. ఇన్ ఫ్లో 1 లక్ష 58 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1 లక్ష 58 వేల 456 క్యూసెక్కులు కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516. మీటర్లుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 317.470 మీటర్లు ఉండగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9..657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.672 టీఎంసీలు ఉంది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.