బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
NEWS Jun 29,2025 08:13 pm
బీజేపీ హైకమాండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈసారి బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రెసిడెంట్ పదవి రేసులో ఈటల రాజేందర్ తో పాటు ఎంపీ రఘునందన్ రావు కూడా బరిలో ఉన్నట్లు సమాచారం.