తుంగభద్ర ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
NEWS Jun 29,2025 12:12 pm
తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1622.12 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 64,500 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 202 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 67.473 టీఎంసీలుగా ఉంది.