స్వంత గూటికి చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
NEWS Jun 29,2025 12:09 pm
ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి చేరుకున్నారు. ఇక నుంచి నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. తనకు వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చినా జిల్లా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పలుసార్లు కేతిరెడ్డిని తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపింది.